Saturday, December 21, 2024

స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : స్వాధీనం చేసుకున్న వాహనాలకు హైదరాబాద్ పోలీసులు సోమవారం వేలం నిర్వహించారు. హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న, వదిలివేయబడిన 962 వాహనాలకు గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో వేలం నిర్వహించారు. ఆసక్తి ఉన్న ఆటోమోబైల్ వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. ఎపి, తెలంగాణ నుంచి సుమారు 550మంది బిడ్డర్లు హాజరయ్యారు.

హైదరాబాద్ సిటీకి చెందిన 916 వాహనాలు, త్రీవీలర్స్08, 15 ఫోర్‌వీలర్లు వేలం వేశారు. వేలం నిర్వహించగా రూ.66,19,000 వచ్చాయి. వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేయనున్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ , జాయింట్ కమిషనర్ సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ ఎం. శ్రీనివాస్, డిసిపి ట్రాఫిక్ అశోక్‌కుమార్, ఎడిసిపి మద్తిపాటి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News