Thursday, December 19, 2024

స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః వివిధ సందర్భాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను వేలం వేయనున్నట్లు సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న 539 వాహనాలను మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో పార్కింగ్ చేశారు. వాహనాల వివరాల కోసం www.cyberabadpolice.gov.inలో పొందుపర్చామని తెలిపారు. వాహనదారులు వివరాలను వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాల యజమానులు డాక్యుమెంట్స్‌తో ఆరు నెలల్లో మొయినాబాద్ ఇన్స్‌స్పెక్టర్‌ను సంప్రదించాలని తెలిపారు. లేకుంటే వాహనాలను వేలంలో విక్రయిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఎంటిఓ విష్ణును సంప్రదించాలని కోరారు. ఎంటిఓ విష్ణు మొబైల్ నంబర్ 9490517317లో సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News