Monday, January 20, 2025

‘మెకానిక్ రాకీ’ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారు

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ మెకానిక్ రాకీ. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మీడియాతో

ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఆ అంశానికి సర్‌ప్రైజ్ అవుతారు..
గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్ ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్‌ను ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఈ సినిమా రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయిం ట్‌తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉం డేది. ఖచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ అంశానికి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్ ని తీసుకోవచ్చు.
యదార్థ సంఘటనల ఆధారంగా..
-మెకానిక్ రాకీ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌కి సెకండ్ హాఫ్‌కి జోనర్ మారుతుంది. సినిమాలో చాలా కథ వుంది. అందరూ కనెక్ట్ అయ్యేలా సినిమా ఉంటుంది. -రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్ రైటింగ్‌ని మెచ్చుకుంటారు. ఇది యదార్థ సంఘటనలను ఆధారంగా -చేసుకొని తీసిన సిని మా. సంఘటనలు ఏమిటనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది. జేక్స్ బిజోయ్ బీజీఎం చింపేశాడు. మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు.
అది ఈ సినిమాతో కుదిరింది..
-సినిమాలో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్, రఘు, సునీల్‌తో పాటు అన్ని పాత్రలు సమాన ప్రాధాన్యతతో ఉంటాయి. ఇది కేవలం హీరో నడిపించే సినిమా కాదు. స్క్రీన్ ప్లే రేటింగ్‌కి మంచి పేరు వస్తుంది. -సునీల్, నరేష్‌తో ఒక మరచిపోలేని మూవీ చేయాలని ఎ ప్పటినుంచో వుండేది. అది ఈ సినిమాతో కుదిరింది. సునీల్, రఘు యాంటీ హీరో రోల్స్ చేస్తున్నారు. -రామ్ తాళ్లూరి చాలా ఓపికగా ఈ సినిమా చేశారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరితో పాటు సినిమా చేశాను.
కొత్త సినిమాలు..
-ప్రస్తుతం నేను చేస్తున్న ‘లైలా’ 60 శాతం పూర్తయింది. సుధాకర్, అనుదీప్ సినిమాలు సమాంతరంగా జరుగుతాయి. ‘కల్ట్’ మార్చిలో మొదలుపెడతాం. ‘ఏమైంది ఈ నగరానికి 2’ రైటింగ్ జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News