Friday, December 20, 2024

పవన్ కల్యాణ్‌వి పిచ్చి మాటలు: ఆదిమూలపు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మండలానికి రెండు సచివాలయల్లో ఒక్కో రోజు క్యాంపులు జరుగుతాయని వివరించారు. ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేయాలన్నదే తమ లక్షమన్నారు. 1902 ద్వారా ఇప్పటికే వచ్చిన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి పిచ్చి మాటలు అని, రోజుకో మాట మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. సిఎంని చేయమని ప్రజలను పవన్ అడగటం ఏంటని ఆదిమూలపు ప్రశ్నించారు. ఎస్‌సిలకు అందుతున్న పథకాల గురించి త్వరలోనే శ్వేతపత్రం అందిస్తామన్నారు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళం చేయాలని చూస్తున్నారని ఆదిమూలపు మండిపడ్డారు. టిడిపి నేతలు అవివేకంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఖమ్మంలో ఉరేసుకున్న కుటుంబం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News