Saturday, December 28, 2024

సరిగమ సౌత్ చేతికి ‘ఖుషీ’ మూవీ ఆడియో రైట్స్

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ‘ఖుషీ’. సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో సినిమా అన్నప్పుడే అందర్లోనూ ఆసక్తి కలిగింది. పైగా శివ నిర్వాణతో సమంత మజిలీ వంటి సూపర్ హిట్ మూవీలో నటించి ఉంది. దీనికి తోడు టైటిల్ కూడా ప్లస్ కావడంతో ఖుషీ మొదలైనప్పటి నుంచీ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గానే ఉంది. అందుకే కాస్త ఆలస్యమైనా సినిమాపై క్రేజ్, అంచనాలు తగ్గలేదు.

అందుకు ఉదాహరణ ఈ మూవీ ఆడియో రైట్స్ కు వచ్చిన క్రేజ్. ఇంకా ఒక్క పాట కూడా విడుదల కాకుండానే ఖుషీ మూవీ ఆడియో రైట్స్ కు భారీ గా పోటీ రావడం విశేషం. ఈ పోటీలో ఆడియో రైట్స్ ను ‘సరిగమ సౌత్’ కంపెనీ ఫ్యాన్సీ రేట్ కు కొనుగోలు చేసింది. ఇది తమ చిత్రానికి తొలి విజయంగా భావిస్తోంది మూవీ టీమ్. బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఖుషీ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News