Friday, December 20, 2024

కర్నాటక బిజెపి అధ్యక్షుడిని తిడుతూ ఆడియో టేప్

- Advertisement -
- Advertisement -

మంగళూరు: బిజెపి కర్నాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌ను దుర్భాషలాడుతూ ఒక వ్యక్తి పెట్టి ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ పార్టీ దక్షిణ కన్నడ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఒక ముస్లిం మతగురువు, ఆయన మద్దతుదారులు కటీల్‌కు స్వాగతం పలుకుతున్న ఫోటోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

దాంతోపాటు కటీల్‌ను దుర్భాషలాడుతూ ఒక ఆడియో క్లిప్ పోస్ట్ చేశాడు. ఈ క్లిప్ వైరల్ కావడంతో బిజెపి దక్షిణ కన్నడ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కటీల్‌ను తిడుతూ ఆడియో క్లిప్ పెట్టిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టి అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ను కోరినట్లు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జగదీష్ సహెనవ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News