Wednesday, January 22, 2025

గృహ నిర్బంధం నుంచి జైలుకు అంగ్‌సాన్ సూకీ

- Advertisement -
- Advertisement -

Aung San Suu Kyi moved to jail

 

బ్యాంకాక్ : గత ఏడాది తిరుగుబాటు చేసిన అంగ్‌సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్ లోకి తరలించినట్టు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం అంగ్‌సాన్ సూకీని రాజధాని నైపిడావ్ లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జామిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుగుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్ లోని ఒక అజ్ఞాత ప్రదేశం లో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హాజరు పర్చడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. ఇంతకు ముందు ఆమె మయన్మార్ లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలా ఏళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు , కొవిడ్ ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్ధారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News