Wednesday, January 22, 2025

ఆంగ్‌సాన్ సూకీ జైలుశిక్ష 26 ఏళ్ల కు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Aung San Suu Kyi's prison sentence extended to 26 years

బ్యాంకాక్ : మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌సాన్ సూకీకి జైలు శిక్షను 26 ఏళ్ల వరకు పొడిగిస్తూ ఆ దేశ న్యాయస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మయన్మార్ సైనిక ప్రభుత్వం గతం లోనే ఆమెపై 11 అవినీతి కేసులను మోపింది. ఇప్పుడు ఇతర కారణాలు చూపిస్తూ మొత్తం 26 ఏళ్ల పాటు ఆమె జైలులో మగ్గిపోయేలా నిర్ణయం తీసుకుంది. ఆంగ్‌సాన్ సూకీ ఆధ్వర్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని మిలిటరీ చేజిక్కించుకుని గత ఏడాది ఫిబ్రవరి 1న సూకీని అరెస్టు చేసింది. డ్రగ్ ట్రాఫికింగ్ చేసే మౌంగ్ వీక్ నుంచి 5,50,000 డాలర్లు లంచం తీసుకున్నారని సూకీపై సైనిక ప్రభుత్వం ఆరోపణలు మోపింది. ఈ ఆరోపణలను సూకీ ఖండించినా ఫలితం లేక పోయింది. ఇప్పుడు మరికొన్ని అభియోగాలు చేస్తూ అన్నింటికీ కలిపి 26 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే సూకీపై 11 అవినీతి కేసులను సైనిక ప్రభుత్వం మోపింది.

ఈ కేసు విచారణలో భాగంగా జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్ల నగదు, 11.4 కిలోల బంగారాన్ని సూకీ లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో సూకీకి ఐదేళ్ల పాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు మాత్రమే. మిగిలిన 10 కేసుల్లోనూ ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే మరింత శిక్ష పడే అవకాశం ఉందని అప్పుడే అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైంది. శిక్ష పొడిగింపుపై సూకీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆమెపై కక్ష తీర్చుకోడానికే ఈ తీర్పు ఇచ్చారని, 2023 లో జరిగే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా అడ్డుకోడానికే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సూకీ తరఫు న్యాయవాదులు అపీలుకు వెళ్లాలని అనుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News