ఎల్బీనగర్ : నాడు చీకట్లు ….. నేడు వెలుగు జిలుగులు అని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ ఎంఈరెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సహల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమం సరూర్‌నగర్ సర్కిల్ ఎస్‌ఈ కరుణ్‌కర్‌బాబు అధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా సుధీర్‌రెడ్డి హజరై జ్యోతి ప్రజల్వన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ముందు ఇనర్వేటర్, జనరేటర్ ఉండేదని, 3 గంటలు అధికారకంగా విద్యుత్ కోతలు, అనధికరికంగా మరో గంట, రెండు గంటలు విద్యుత్ పోయేదని, స్వరాష్ట్రం ఏర్పడితై రాష్ట్రం అంధకారంలోకి వస్తాదని, విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేశారని తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలో విద్యుత్ కోతలు లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి ఉంటుందని, అదే సీఎం 5 ఏండ్లు అనంతరం సీఎం కేసిఆర్ విద్యుత్ అభినందించారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్దం 7,778 మెగావాట్లు ఉండగా నేడు మార్చి 2023 వరకు 15,497 మెగావాట్లు చేరిందని , ఈ వేసవిలో సుమారుగా 16,000 మెగావాట్ల విద్యుత్ దాటోచ్చని తెలిపారు. నిరంతరం విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ , మాకు పోటీ దేశంలో ఏరాష్ట్రం లేదన్నారు. విద్యుత్ లేకుండా ఏ రంగం రాణించదని , విద్యుత్ ఆదా చేయండి , పొదుపుగా వాడాలని సూచించారు. భావితరాల కోసం సీఎం కెసిఆర్ విద్యుత్ ప్రణాళికలు ఏన్నో సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈలు రామకృష్ణ , రాంమోహన్ , సంధ్యశ్రీ , జీహెచ్‌ఎంసీ డీఈ పున్నా నాయక్ ,ఎస్‌ఎఓ రమణారెడ్డి , ఎడీఈలు యుగేందర్ ,తిరపతయ్య ,ప్రభాకర్ ,రాంచంద్రం ,పురుషోత్తం ,ఎఈలు ,సిబ్బంది ,హయత్‌నగర్ సర్కిల్ డీసీ మారుతి దివాకర్ , జీహెచ్‌ఎంసీ ఫ్లోర్‌లీడర్ ,లింగోజిగూడ కార్పోరేటర్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి ,మాజీ కార్పోరేటర్లు విఠల్‌రెడ్డి , రాజశేఖర్‌రెడ్డి , సీనియర్ నాయకులు గజ్జెల మదుసూధన్‌రెడ్డి ,శ్రీనివాస్‌నాయక్ , రఘుమారెడ్డి , డివిజన్ అధ్యక్షులు జక్కడి మల్లారెడ్డి , చిరంజీవి , చింతల రవికూమార్, తోట మహేష్ యాదవ్ ,అరవింద్‌రెడ్డి జక్కడి రఘువీర్‌రెడ్డి ,శరత చంద్రలు పాల్గొన్నారు.
అవహేళన చేసిన వారే ఔరా అన్నారు : సుధీర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -