Tuesday, December 24, 2024

శంభాజీనగర్‌గా ఔరంగాబాద్….. ధారాశివ్‌గా ఒస్మానాబాద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఒస్మానాబాద్ నగరాన్ని ధారాశివ్‌గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఔరంగాబాద్ పేరు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుంచి, ఒస్మానాబాద్ పేరు 20వ శతాబ్దానికి చెందిన హైదరాబాద్ నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి వచ్చాయి. ఔరంగాబాద్‌కు కొత్తగా పెట్టిన ఛత్రపతి శంభాజీ పేరు మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడిది. తన తండ్రి మరణానంతరం మరాఠా సామ్రాజ్యాన్ని శంభాజీ పాలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News