Monday, January 20, 2025

స్కూల్‌లో చెట్టుకు ఉరేసుకున్న డ్రైవర్

- Advertisement -
- Advertisement -

లక్నో: స్కూల్‌లో డ్రైవర్ చెట్టుకు ఉరేసుకొని చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆరియా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దిబియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కకోర్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో హాకీమ్ సింగ్ (55) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. పగలు ఆ స్కూల్ బస్సులకు డ్రైవర్‌గా పని చేయడంతో పాటు రాత్రి సమయంలో ఆ స్కూల్‌కు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆదివారం హాకీమ్ సింగ్ ఇంటికి రాకపోవడంతో కుమారుడు ఆయుష్ స్కుల్‌కు వెళ్లాడు. తండ్రి వేప చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read: ప్రియుడి కోసం వచ్చి ఇరుక్కుపోయిన పాకిస్తాన్ ప్రియురాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News