Wednesday, January 22, 2025

రాణించిన ఖవాజా, గ్రీన్.. ఆసీస్ 480 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆథిత్య టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. 255/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆసీస్ ఆటగాళ్లలో ఆద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఉస్మాన్ ఖవాజా(180) డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.ఖవాజాతోపాటు కామెరూన్ గ్రీన్(114) సెంచరీతో చెలరేగాడు.

దీంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా.. షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.క్రీజులో ఓపెనర్లు రోహిత్ శర్మ(17), శుభమన్ గిల్(18)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News