Friday, February 28, 2025

రెండు జట్లకు కీలకం

- Advertisement -
- Advertisement -

నేడు అఫ్గాన్‌తో ఆస్ట్రేలియా ఢీ

కరాచీ: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం జరిగే కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇందులో గెలిచే జట్టు నేరు గా సెమీ ఫైనల్‌కు చేరుకుంటోంది. ఇంగ్లండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ చారిత్రక విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే బలమైన ఆస్ట్రేలియాను ఓడించడం అఫ్గాన్‌కు అంత తేలికేం కాదనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కంగారూలు 352 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాను ఓడించడం అఫ్గాన్ చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ సమతూకంగా ఉంది. ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారే, మాక్స్‌వెల్ వం టి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నా రు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జోష్ ఇంగ్లిస్ ఇంగ్లిస్ కళ్లు చెదిరే శతకం సాధించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇంగ్లిస్ చెలరేగితే ఆస్ట్రేలియాకు ఎదురే ఉండదు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ట్రావిస్, స్మిత్‌లు ఈసారి బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. వీరు కూడా ఫామ్‌లోకి వస్తే ఆస్ట్రేలియా బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాయి. లబుషేన్, షార్ట్, మాక్స్‌వెల్‌లు జోరుమీదుండడం ఆస్ట్రేలియాకు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. స్పెన్సర్ జాన్సన్, బెన్ ద్రవర్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కంగారూలకే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించిన అఫ్గాన్ ఈపోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అఫ్గాన్ సమతూకంగా ఉంది. జోఫ్రా ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని అఫ్గాన్ 300కి పైగా స్కోరును సాధించింది.

ఈసారి అంతకంటే ఎక్కువ పరుగులు సాధించి ఆసీస్‌పై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఇంగ్లండ్‌పై విధ్వంసక శతకం సాధించిన ఇబ్రహీం జద్రాన్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రహమానుల్లా గుర్బాజ్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మహ్మద్ నబి, రషీద్ ఖాన్, నూర్‌అహ్మద్ వంటి స్టార్ క్రికెటర్లు అఫ్గాన్‌లో ఉన్నారు. తమదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా మట్టికరిపించే సత్తా అఫ్గాన్‌కు ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో సంచలన ఫలితం నమోదైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News