Sunday, January 19, 2025

నేటి నుంచి యాషెస్ సంగ్రామం

- Advertisement -
- Advertisement -

బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ పోరు జరగడం అనవాయితీగా వస్తోంది. ప్రపంచ క్రికెట్‌లోనే యాషెస్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇరు జట్ల మధ్య జరిగే ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. ఈసారి యాషెస్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇస్తోంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. కిందటి సారి యాషెస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది.

ఈసారి సొంత గడ్డపై జరిగే యాషెస్ సిరీస్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఇంగ్లండ్ ఉంది. ఇరు జట్లలోనూ అగ్రశ్రేణి క్రికెటర్లకు కొదవలేదు. ఆస్ట్రేలియాకు కమిన్స్, ఇంగ్లండ్‌కు బెన్ స్టోక్స్ సారథ్యం వహిస్తున్నారు. వార్నర్, స్మిత్, లబుషేన్, లియాన్, హెడ్, గ్రీన్, స్టార్క్ తదితరులతో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉంది. ఇక స్టోక్స్, బ్రాడ్, రూట్, అండర్సన్‌లతో ఇంగ్లండ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో యాషెస్ సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News