Wednesday, January 22, 2025

నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు..

- Advertisement -
- Advertisement -

లండన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి ఐదో, చివరి టెస్టు మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ సవాల్‌గా మారింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 21 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. నాలుగె టెస్టులో వర్షం ఇంగ్లండ్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది.

భారీ వర్షం వల్ల చివరి రోజు ఆట పూర్తిగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా డ్రాతో గట్టెక్కింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలవగా, మూడో టెస్టులో ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఇక చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉంది. కిందటి మ్యాచ్‌లో గెలిచే స్థితిలో ఉండి కూడా ఇంగ్లండ్ డ్రాతో సంతృప్తి పడాల్సి వచ్చింది. ఈసారి మాత్రం మరింత మెరుగైన ప్రదర్శనతో విజయం సాధించాలని తహతహలాడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News