- Advertisement -
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 22 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. ఇక తర్వాత వచ్చిన గిల్(1), విరాట్ కోహ్లీ(3)లు వెంటవెంటనే వికెట్ చేజార్చుకున్నారు. దీంతో భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో వర్షం అంతరాయం కలిగించడంతో ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం 7.2 ఓవర్లలో 22 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ కెఎల్ రాహుల్(13), రిషబ్ పంత్(0)లు ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు, హజల్ హుడ్ ఒక వికెట్ తీశారు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది.
- Advertisement -