Thursday, December 19, 2024

AUS vs IND: గబ్బా టెస్టు మ్యాచ్ డ్రా..

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు వర్షం కారణంగా రెండు సెషన్ల ఆట రద్దు అయ్యింది. దీంతో మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను డ్రాగా ప్రకటించారు. బుధవారం ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 260 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ను 89/7 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత్ 8 పరుగులు చేసి అనంతరం వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను డ్రాగా ముగించారు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక, ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ 1-1తో భారత్-ఆస్ట్రేలియా సమంగా నిలిచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News