బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకుంది. 221 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను నితీశ్ కుమర్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లు ఆదుకున్నారు. ముఖ్యంగా నితీశ్ చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. సుందర్ మంచి సహకారం అందిచడంతో నితీశ్, ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో నితీశ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి జట్టుకు సెంచరీ భాగస్వామ్యం అందించారు. దీంతో టీమిండియా స్కోరు 300 పరుగులు దాటింది. ఈ క్రమంలో టీ బ్రేక్ కు వెళ్లగా.. వర్షం కూడా రావడంతో మ్యాచ్ ను నిలిపేశారు. కొద్దిసేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. కాగా, ప్రస్తుతం భారత్ 7 వికెట్లు నష్టపోయి 326 పరుగులు చేసింది. క్రీజులో నితీశ్(85), సుందర్లు(39) ఉన్నారు.