Wednesday, January 15, 2025

ముగిసిన రెండో రోజు ఆట.. ఆస్ట్రేలియా 405/7

- Advertisement -
- Advertisement -

టీమిండియా జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 28/0తో ఆదివారం ఆసీస్ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోయినా.. ట్రావిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) అద్భుత శతకాలతో చెలరేగారు. వీరిద్దరు కలిసి దాదాపు 240 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా కొనసాగుతున్న క్రమంలో బుమ్రా భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. వీరిద్దరిని ఔట్ చేయడంతోపాటు క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్ ను పెవిలియన్ పంపించాడు.

అయితే,ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అలెక్స్ కేరీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో ఆట ముగిసే సమాయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. క్రీజులో అలెక్స్ కేరీ (45), మిచెల్ స్టార్క్(7)లు ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. నితిష్ కుమార్ రెడ్డి, సిరాజ్ లు చెరో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News