Friday, January 24, 2025

ఆస్ట్రేలియా ఆలౌట్.. భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తిగా మారింది. బౌలర్ల విజృంభనతో ఇరుజట్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యాయి. ఓవర్ నైట్ స్కోరు 67/7తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ త్వరగానే రెండు వికెట్లు కోల్పోయినా.. చివర్లో మిచెల్ స్టార్క్(26 పరుగులు, 112 బంతుల్లో 2 ఫోర్లు) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు.

హజల్ వుడ్(07 నాటౌట్)తో కలిసి 110 బంతుల్లో 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పోయారు. ఈ క్రమంలో హర్షిత్ రాణా స్టార్క్ ను ఔట్ చేయడంతో ఆసీస్ 104 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రాకి ఐదు వికెట్లు, హర్షిత్ రాణా 3, సిరాజ్‌ 2 తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. తమ తొలి టీమిండియా 150 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News