Wednesday, December 25, 2024

AUS vs IND: స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

పెర్త్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోయింది. మొదట భారీ శతకంతో చెలరేగుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(161).. డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న క్రమంలో భారీ షాట్ కు యత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్.. వచ్చి రాగానే దూకుడుగా ఆడేందకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో క్రీజు వదిలి ముందుకు వచ్చిన రిషబ్ పంత్(1)ను నాథన్ లియోన్ బోల్తా కొట్టించాడు. దీంతో పంత్ స్టంపౌట్ గా వెనుదిరిగాడు.

అనంతరం ధ్రువ్ జురెల్(1) కూడా నిరాశపర్చాడు. అతడిని పాట్ కమిన్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 14 పరుగుల వ్యవధిలో భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్‌ 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసిది. క్రీజులో విరాట్ కోహ్లీ(40), వాషింగ్టన్ సుందర్(12)లు ఉన్నారు. ఇప్పటివరకు టీమిండియా 402 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News