Wednesday, January 15, 2025

హెడ్, స్మిత్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్స్ సెంచరీలతో కదం తొక్కారు. టీమిండియా బౌలర్లపై దాడి చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్.. వంద పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ లు మరో వికెట్ కోల్పోకుండా మొదట ఆచితూచి ఆడారు. తర్వాత భారత బౌలర్లపై ఎదరుదాడికి దిగారు. క్రమంగా జోరు పెంచిన వీరిద్దరూ చెత్త బంతులను బౌండరీ తరలిస్తూ..భారత్ పై ఒత్తడి పెంచారు.

ఈ క్రమంలో మొదట సెంచరీ పూర్తి చేసుకున్నాడు హెడ్.. తర్వాత కొద్దిసేపటికి స్మిత్ కూడా శతకం బాదాడు. ఇక, వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు ఇప్పటివరకు 233 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరోవైపు, వికెట్ తీసేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్(141), స్టీవ్ స్మిత్(100)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News