- Advertisement -
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్స్ మరోసారి తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు. దీంతో భారత్ 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు 19 పరుగుల స్వల్ప లక్ష్యం లభించింది. టీమిండియా బ్యాట్స్ మెన్లలో మరోసారి నితీశ్ కుమార్ రెడ్డి(42) మాత్రమే రాణించాడు. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్ కమిన్స్ మరోసారి ఐదు వికెట్లతో చెలరేగి భారత్ ను దెబ్బకొట్టాడు. దీంతో ఆసీస్ విజయం దాదాపు ఖాయమైంది.
- Advertisement -