- Advertisement -
రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 19 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్ లోనూ ఘోరంగా విఫలమైంది. సీనియర్లు రోహిత్, కోహ్లీలతోపాటు ఓపెనర్లు కెఎల్ రాహుల్, జైస్వాల్, రిషబ్ పంత్, గిల్ లు ఆసీస్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక తక్కవ స్కోరు పెవిలియన్ కు చేరారు.
అయితే, నితిష్ కుమార్ రెడ్డి(42) మాత్రమే ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. చివర్లో దూకుడుగా ఆడే క్రమంలో కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో భారత్ 175 పరుగులకే పరిమితమైంది. అనంతరం 19 పరుగుల టార్గట్ ను 3.2 ఓవర్లలో చేధించి ఘన విజయం సాధించింది. దీంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 1-1తో సమం అయ్యింది.
- Advertisement -