Thursday, January 16, 2025

AUS vs IND: హెడ్ అర్థశతకం.. వికెట్ కోసం శ్రమిస్తోన్న భారత బౌలర్లు

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆదిలో రెండు వికెట్లు కోల్పోయినా తర్వాత పుంజుకుంది. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ అర్థశతకం బాదాడు. మరోసారి భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్ లో స్టీవ్ స్మిత్ కూడా అర్ధశతకానికి చేరువయ్యాడు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే 85 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆసీస్ జట్టు భారీ స్కోరు దిశగా పయనిస్తుంది.

ఇక, వికెట్‌ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హెడ్, స్మిత్ క్రీజులో పాతుకుపోవడంతో వారిని ఔట్ చేసేందుకు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (52), స్టీవ్ స్మిత్ (46)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News