Wednesday, December 25, 2024

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. జైస్వాల్ రికార్డులే రికార్డులు

- Advertisement -
- Advertisement -

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య జట్టు ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పెర్త్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన జైస్వాల్… రెండవ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 205 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్సులతో శతకం బాదిన జైస్వాల్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2024లో మొత్తం 34 సిక్సులు కొట్టాడు జైస్వాల్. ఒక ఇయర్ లో కొట్టిన అత్యధిక సిక్సులు ఇవే. దీంతో 2014లో 33 సిక్సర్లతో న్యూజిలాండ్ మాజీ దిగ్గజం బ్రెండన్ మెక్‌కల్లమ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు.

దీంతోపాటు ఆస్ట్రేలియాతో ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా యశస్వి నిలిచాడు.అంతేకాదు, ఆస్ట్రేలియాలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గానూ రికార్డులకెక్కాడు.ఇక, అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా యశస్వి(141 నాటౌట్) రికార్డు సృష్టించాడు. అంతకుముందు సునీల్ గావస్కర్ పేరిట(113) ఈ రికార్డు ఉంది. ఒక సెంచరీతో పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్ పై మాజీ క్రికెటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి  భారత్ ఒక వికెట్ నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజులో జైస్వాల్(141), దేవదత్ పడిక్కల్(25)లు ఉన్నారు. దీంతో ప్రస్తుతం టీమిండియా 321 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News