Wednesday, January 22, 2025

ఉప్పల్‌లో ఆసీస్-పాక్ వార్మప్ మ్యాచ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచకప్‌నకు సన్నాహకంగా నిర్వహిస్తున్న చివరి వార్మప్ మ్యాచ్‌కు పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ పోరు జరుగనుంది. ఉప్పల్‌లో  జరిగే మ్యాచ్ ఇటు ఆస్ట్రేలియాకు అటు పాకిస్థాన్‌కు కీలకంగా మారింది. కివీస్‌తో ఉప్పల్‌లో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు ఓటమి ఎదురైంది.

ఈ మ్యాచ్‌లో పాక్ భారీ స్కోరు సాధించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆస్ట్రేలియా జరిగే మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లోనైనా లోపాలను సరిదిద్దు కోవాలని భావిస్తోంది. ఇదిలావుంటే తిరువనంతపురంలో జరిగే మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News