- Advertisement -
టీమిండియా మహిళా జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుతు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన 298 పరుగులు చేసింది. ఆసీస్ అన్నాబెల్ సదర్లాండ్(110) సెంచరీతో చెలరేగింది. ఇక, భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి నాలుగు వికెట్లతో రాణించింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ధీటుగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం భారత్ 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధనా(62) అర్థశతకం బాదగా.. మరో బ్యాటర్ హర్లీన్ డీయోల్(36) ఆచుతూచి ఆడుతున్నారు.
- Advertisement -