Thursday, December 12, 2024

తొలి వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మళిళా జట్టు 16.2 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆస్ట్రేలియా మహిళా బౌలర్లు విజృంభనతో భారత్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న ఆసీస్‌ బౌలర్ మెగాన్ స్కట్ 5 వికెట్లు చెలరేగడంతో భారత్ కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్‌ (23) టాప్‌ స్కోరర్ గా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News