Thursday, December 12, 2024

చెలరేగిన ఆసీస్‌ బౌలర్లు.. 100 పరుగులకే భారత్‌ ఆలౌట్

- Advertisement -
- Advertisement -

ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ అతి తక్కువ స్కోరుకే చేతులెత్తేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే, ఆస్ట్రేలియా మహిళా బౌలర్లు విజృంభనతో భారత్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న ఆసీస్‌ బౌలర్ మెగాన్ స్కట్ 5 వికెట్లు చెలరేగడంతో భారత్ కోలుకోలేకపోయింది. భారత బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్‌ (23) టాప్‌ స్కోరర్ గా నిలిచింది. దీంతో టీమిండియా, ఆసీస్ కు కేవలం 101 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత్‌: ప్రియా పునియా, స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్‌, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, టిటాస్ సధు, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, రేణుకా సింగ్‌

ఆస్ట్రేలియా: ఫోబ్‌ లిట్చ్‌ఫీల్డ్‌, జార్జియా వోల్, ఎల్సీ పెర్రీ, బెత్ మూన్ (వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డెనర్, తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), జార్జియా వారేహమ్, అలానా కింగ్, కిమ్ గార్త్, మెగాన్ స్కట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News