Friday, December 20, 2024

కివీస్ 82 పరుగులకే ఆలౌట్.. ఆస్ట్రేలియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

AUS Won by 113 runs against NZ in 2nd ODI

కెయిర్న్: న్యూజిలాండ్‌తో గురువారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలివుండగానే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 33 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. ఆడమ్ జంపా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఇక సీన్ అబాట్ ఐదు ఓవర్లలో ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్న మిఛెల్ స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. కివీస్ బ్యాటర్లలో విలియమ్సన్ (17) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ (61), స్టార్క్ 38 (నాటౌట్) రాణించారు. మాక్స్‌వెల్ (25), హాజిల్‌వుడ్ 23 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు.

AUS Won by 113 runs against NZ in 2nd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News