Sunday, December 22, 2024

ఆస్ట్రేలియా క్లీన్‌ స్వీప్..

- Advertisement -
- Advertisement -

AUS Won by 25 runs Against NZ in 3rd ODI
ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్
కివీస్‌పై 3-0తో వన్డే సిరీస్ కైవసం
ప్లేయర్ ఆఫ్ ది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ స్మిత్
కెయిర్న్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్‌పై 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన సిరీస్‌లోని మూడో వన్డేలో ఆసీస్ 25పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన కంగారూలు నిర్ణీత 50ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 267పరుగులు చేసింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 131బంతుల్లో 11ఫోర్లు, సిక్స్‌తో చేసి సెంచరీతో మెరవగా, లబుషేన్ 78 బంపతుల్లో 2ఫోర్లుతో 52పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో అలరించాడు. కెరీర్లో చివరి అంతర్జాతీయ వన్డే ఆడిన ఆసీస్ కెప్టెన్ ఫించ్ కేవలం 5పరుగులే చేసి సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ రెండు వికెట్లు తీయగా, సౌథీ, ఫెర్గూసన్, శాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఆసీస్ నిర్దేశించిన 268పరుగుల లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 242 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 53బంతుల్లో రెండుఫోర్లు, రెండు సిక్స్‌లతో 47పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంతకుముందే సిరీస్ కైవసం చేసుకున్న ఆసీస్ ఈ విజయంతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో మెరిసిన స్మ్తిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ కివిస్‌ను వైట్‌వాష్ చేసి తన వన్డే కెరీర్‌ను విజయవంతంగా ముగించాడు.

AUS Won by 25 runs Against NZ in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News