Sunday, December 22, 2024

అదరగొట్టిన ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

అదరగొట్టిన ఆస్ట్రేలియా
హార్దిక్ మెరుపులు వృథా, గ్రీన్, వేడ్ జోరు
తొలి టి20లో భారత్‌పై ఆసీస్ గెలుపు
మొహాలీ: భారత్‌తో మంగళవారం జరిగిన తొలి టి20 ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకుంది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అరోన్ ఫించ్, కామెరూన్ గ్రీన్ శుభారంభ అందించారు. ఫించ్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి గ్రీన్ జోరును కొనసాగించాడు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ధాటిగా ఆడిన గ్రీన్ 30 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 61 పరుగులు చేశాడు. స్మిత్ 3 ఫోర్లు, సిక్స్‌తో 35 పరుగులు సాధించాడు. చివర్లో టిమ్ డేవిడ్ (18)తో కలిసి మాథ్యూ వేడ్ జట్టును లక్షం వైపు నడిపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వేడ్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను హార్దిక్ పాండ్య ఆదుకున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ 30 బంతుల్లోనే ఏడు బౌండరీలు, మరో ఐదు సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ రాహుల్ (55), సూర్యకుమార్ (46) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. దీంతో భారత్ భారీ స్కోరును నమోదు చేసింది.

AUS Won by 4 wickets against IND in 1st T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News