Friday, December 20, 2024

ఈనెల 11వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు శుభ ముహుర్తాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతుండడంతో ఈ నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయ్యింది. ఈ నెల 11వ తేదీన మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మార్చి, ఏప్రిల్ నెలాఖరు వరకు దాదాపు మూడు నెలల పాటు శుభముహూర్తాలు ఉన్నాయని వేదపండితులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 26వ తేదీ వరకు మాఘం, ఫాల్గుణం, చైత్రం ఈ మూడు మాసాలు (ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో) దాదాపు 30 ముహూర్తాలు ఉన్నాయి.

ఫిబ్రవరి 11వ తేదీ నుంచి తొలి ముహూర్తం మొదలు కాగా, ఏప్రిల్ 26వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మూడునెలల్లో 30 ముహూర్తాలు ఉండగా సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు ఉంటాయి. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీతోనే ముహూర్తాలన్నీ అయిపోతున్నాయి. తర్వాత మూఢం, శూన్య మాసం వస్తుండడంతో మళ్లీ శ్రావణ మాసం (ఆగస్టు) వరకు ముహూర్తాలు లేవు. శ్రావణ మాసం వచ్చేసరికి వానాకాలం మొదలవుతుందని వేదపండితులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News