బ్రిస్బేన్: భారత్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(21), మార్కస్ హర్రీస్(1)లు క్రీజులో ఉన్నారు. దీంతో ఆసీస్ జట్టు 54 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్ మెన్స్ శార్దుల్ ఠాకూర్(67), వాషింగ్టన్ సుందర్(62)లు ఏడో వికెట్ కు రికార్డు స్థాయిలో 123 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 33 పరుగుల స్వల్ప ఆధక్యం లభించింది. కాగ, మరో రెండు రోజుల ఆట మాత్రమే ఉండడంతో మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.
Australia 21/0 at Stumps on Day 3 Against India