Saturday, January 18, 2025

ఆసీస్ 89/7 డిక్లేర్డ్

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆసీస్ 18 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 89 పరుగుల డిక్లేర్డ్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 275 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ బౌలింగ్ దెబ్బకు ఆసీస్ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లు అలెక్స్ కారే(20 నాటౌట్), మిచెల్ స్టార్క్(02 నాటౌట్), కమ్నీస్ (22), ట్రావిస్ హెడ్(17) ఉస్మాన్ ఖావాజా(08), నాథన్ మెక్ స్వీనాయ్(04), మార్నష్ లబుషింగే(01), మిచెల్ మార్ష్(02), స్టివెన్ స్మిత్(04) పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా ఆకాశ్ దీప్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 445
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 260

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News