Thursday, January 23, 2025

ఆస్ట్రేలియా 263 ఆలౌట్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 20 ఆధిక్యంలో ఉంది. ఇక తాజాగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావించిన ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. మిఛెల్ మార్ష్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మార్ష్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో 118 పరుగులు చేశాడు. మిగతా వారిలో ట్రావిస్ హెడ్ (39) మాత్రమే కాస్త రాణించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో మార్క్‌వుడ్ ఐదు, వోక్స్ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News