సిడ్నీ: భారత్ లో కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 15వరకు భారత్ నుంచి విమాన రాకపోకలపై ఆస్ట్రేలియా తాత్కాలిక నిషేధం విధించింది. భారత్ నుంచి విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. కోవిడ్ సంక్షోభాన్ని నివారించేందుకు కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్ సహా పలు దేశాలు విమానాలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా రోజువారీ కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఇండియా కోవిడ్ సెకండ్ వేవ్ తో పోరాడుతోంది. కరోనా వైరస్ సంక్షోభం దృష్ట్యా థాయిలాండ్, నెదర్లాండ్స్, ఇరాన్, కెనడా, యుఎఇ, హాంకాంగ్ భారతదేశం నుండి విమానాల సర్వీసులను రద్దు చేసింది. యుకె విధించిన తాజా ఆంక్షల కారణంగా యునైటెడ్ కింగ్‌డమ్‌కు బయలుదేరే ఎయిర్ ఇండియా విమానాలు ఏప్రిల్ 24 నుండి 30 వరకు రద్దు చేయబడ్డాయి.
Australia will suspend all direct passenger flights from India until May 15, says PM Scott Morrison. #COVID19 pic.twitter.com/sev4Ym5rNk
— ANI (@ANI) April 27, 2021