Saturday, March 1, 2025

సెమీస్‌ మ్యాచ్‌.. ఆస్ట్రేలియాకు కీలక ఆటగాడు దూరం!

- Advertisement -
- Advertisement -

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ వర్షార్పణం అయినప్పటికీ.. ఆస్ట్రేలియా సెమీస్‌కు అర్హత సాధించింది. అయితే సెమీ ఫైనల్‌కి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఆసీస్ ఆల్ రౌండర్ మ్యాథ్యూ షార్ట్ పలు గాయాలతో సెమీస్ మ్యాచ్‌కి దూరం అయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షార్ట్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. 66 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇప్పుడు అతను జట్టుకు దూరం కావడం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.

ఆఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గాయం అయింది. దీంతో ఆ తర్వాత కాస్త ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్‌కి వచ్చాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సుతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘అతను సరిగ్గా కదలడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే సెమీస్ మ్యాచ్‌లకు ఇంకా సమయం ఉంది.. అప్పటివరకూ అతను కోలుకుంటాడని అనుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. అయితే షార్ట్ ఈ మ్యాచ్‌కి దూరం అయితే.. అతని స్థానంలో జేక్ ఫ్రెజర్ మెక్‌గ్రక్ కానీ, ఆరోన్ హార్డీని కానీ జట్టులోకి తీసుకొనే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News