లార్డ్ : ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా రెండో విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో 20తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. లార్డ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 43 పరుగులతో విజయం సాధించింది. అంతకుముందు 371 పరుగుల లక్ష ఛేదనకు దిగిన ఆతిధ్య జట్టు 327 పరుగలకు ఆలౌట్ అయ్యింది. బెన్‌స్టోక్స్ 155 పరుగులతో రాణించినప్పటికీ ఇంగ్లండ్‌కు విజయాన్నందించలేక పోయాడు. 144/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభంచిన ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్‌స్టోక్స్‌తో పాటు బెన్ డెకెట్(83) రాణించినా మిగతావారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.
ఇక ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోస్ హాజిల్‌వుడ్‌లు మూడేసి వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో రాణించాడు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 279 పరుగులకే ఇంగ్లండ్ కుప్పకూల్చింది. అయితే, 371 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది.