బెనోని : వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ భారత్ చెత్త బ్యాటింగ్‌తో తుది మెట్టుపై బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి అండర్19 వరల్డ్ చేజార్చుకుంది. బౌలింగ్‌లలో రాణించినా బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. దీంతో భారత్ కప్ గెలుస్తుందని ఆశగా ఎదురు చూసిన భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లారు. ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక యంగ్ టీమిండియా చతికిలపడింది. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు. టోర్నీలో నిలకడగా రాణించిన ఆసీస్ ఫైనల్ లో భారత్ ను చిత్తు చేసి మరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. లక్ష ఛేదనలో భారత జట్టు మరోసారి ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. ఆ స్ట్రేలియా బౌలర్ల ధాటికి 174 పరుగులకే ఆలౌట్ కావడంతో 79 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
దీంతో రికార్డు స్థాయిలో 6వ సారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది టీమిండియా. ఈ భారీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్ పూర్తిగా ఒత్తిడికి గురై ఫ్లాప్ అయింది. మూడో ఓవర్‌లోనే టీమ్‌ఇండియా తొలి వికెట్ పడగా, ఆ తర్వాత ఒక్కో క్కరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆదర్శ్ సింగ్ మాత్రమే 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు కాగా.. ఆఖరి మ్యాచ్‌లో ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, సచిన్ దాసా విఫలమయ్యారు. ఫైనల్లో ముషీర్ ఖాన్ 22 పరుగుల వద్ద, ఉదయ్ సహారన్ 8 పరుగుల వద్ద, సచిన్ దస్ 9 పరుగుల వద్ద ఔట్ కావడంతో టీమిండియా ప్రపంచకప్ కల చెదిరిపోయింది. చివర్లో మురుగన్ అభిషేక్ (42), నమన్ తివారీ (14)లు టీమ్ ఇండియాకు కొంత పోరాటాన్ని అందించారు, అయితే స్కోరు చాలా పెద్దది. దీంతో భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటయి 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.