Sunday, January 19, 2025

ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత్‌తో ఆదివారం జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టి20లో ఆతిథ్య భారత మహిళలు విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. దీప్తి శర్మ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి విజయం సాధించింది. ఎలిసె పేరి 34 (నాటౌట్) జట్టును గెలిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News