- Advertisement -
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 20తో సొంతం చేసుకుంది. 281 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిఛెల్ మార్ష్, అలెక్స్ కారీ ఆదుకున్నారు. మార్ష్ 10 ఫోర్లు, సిక్సర్‌తో 80 పరుగులు చేశాడు. కారీ 15 ఫోర్లతో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ కమిన్స్ 32 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించాడు. కివీస్ ఈ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
- Advertisement -