Wednesday, January 15, 2025

తొలి టి20లో ఆస్ట్రేలియా గెలుపు

- Advertisement -
- Advertisement -

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన వార్నర్ 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 32 పరుగులు సాధించాడు.

హెడ్ 3 ఫోర్లు, సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ మిఛెల్ మార్ష్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లనుదీటుగా ఎదుర్కొన్న మార్ష్ 44 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్ 11 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన టిమ్ డేవిడ్ 10 బంతుల్లోనే 31 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను డెవోన్ కాన్వే (63), రచిన్ రవీంద్ర (68), ఫిన్ అలెన్ (32) ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News