Sunday, December 22, 2024

ఆస్ట్రేలియాకు సిరీస్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో టెస్టు మిగిలివుండగానే 20 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్ చివరికి ఆస్ట్రేలియాకి చిక్కింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి 79 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. మిఛెల్ మార్ష్, వికెట్ కీపర్ అలెక్స్ కారే, స్టీవ్ స్మిత్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 13 బౌండరీలతో 96 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక కారే కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన కారే 8 ఫోర్లతో 53 పరుగులు చేశాడు. స్మిత్ 176 బంతుల్లో 50 పరుగులు సాధించాడు.

కాగా, పాక్ బౌలర్లలో షహీన్, హంజా నాలుగేసి వికెట్లు తీశారు. జమాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. తర్వాత 341 పరుగుల లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్ (4), ఇమామ్ ఉల్ హక్ (12) విఫలమయ్యారు. అయితే కెప్టెన్ షాన్ మసూద్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు జట్టుకు అండగా నిలిచారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మసూద్ ఏడు ఫోర్లతో 60 పరుగులు చేశాడు. బాబర్ 4 ఫోర్లతో 41 పరుగులు సాధించాడు. సౌద్ షకిల్ (24), రిజ్వాన్ (35) పరుగులు చేశారు. ఇక ధాటిగా ఆడిన ఆఘా సల్మాన్ (50) పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతావారు విఫలం కావడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 237 పరుగుల వద్దే ముగిసింది. కాగా, పాక్ చివరి నాలుగు వికెట్లను ఒక్క పరుగు కూడా జోడించకుండానే కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ నాలుగు, కమిన్స్ ఐదు వికెట్లు పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News