Monday, December 23, 2024

సౌతాఫ్రికాపై ఇన్నింగ్స్ విజయం.. సిరీస్ కైవసం చేసుకున్న ఆసిస్

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలివుండగానే 20తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలవడంతో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 68.5 ఓవర్లలో 204 పరుగులకే ఆలౌటైంది. 15/1 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు.

ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ సరెల్ ఎర్వి (21), వన్‌డౌన్‌లో వచ్చిన బ్రుయున్ (28) పరుగులు చేసి వెనుదిరిగారు. ఖయా జొండో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తెంబ బవుమా మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. వికెట్ కీపర్ కిల్ వెర్నెతో కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ధాటిగా ఆడిన వెర్నె ఐదు ఫోర్లతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన బవుమా 6 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మిగతావారు విఫలం కావడంతో సౌతాఫ్రికాకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్ మూడు, బొలాండ్ రెండు వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News