Wednesday, January 22, 2025

ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ కన్నుమూశారు. మారియా గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మారియా మృతి చెందడం బాధకరమైన విషయమని ఆస్ట్రేలియా టీమ్, టీమిండియా క్రికెట్ సభ్యులు సంతాపం తెలిపారు. ఆసీస్ క్రికెటర్లు నాలుగో టెస్టు సందర్భంగా నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్నారు. తల్లి అనారోగ్యం పాలు కావడంతో కమిన్స్ రెండు టెస్టులు ఆడి మూడో టెస్టు నుంచి దూరమయ్యాడు. తల్లి చివరి రోజుల్లో పక్కనే ఉండాలని కమిన్స్ భావించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News