Wednesday, January 22, 2025

గుజరాత్‌లో మొదటి విదేశీ యూనివర్సిటీ క్యాంపస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో క్యాంపస్ నెలకొల్పేందుకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీకి ఆమోదం తెలిపినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ లథారిటీస్(ఐఎఫ్‌ఎస్‌సిఎ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఆమోదంతో భారత్‌లో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొదటి విదేశీ యూనివర్సిటీగా డీకిన్ పేరు సంపాదించుకుంది. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో తన క్యాంపస్ స్థాపించేందుకు డీకిన్ యూనివర్సిటీకి ఆమోదం తెలిపినట్లు ఐఎఫ్‌ఎస్‌సిఎ చైర్‌పర్సన్ ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. మార్చి 8న గాంధీనగర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News