Monday, December 23, 2024

శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా తొలి విజయం నమోదు చేసింది. సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఈ టోర్నీలో మొదదటి విజయాన్ని అంకుకుంది. ఇక శ్రీలంక వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకే కుప్పకూలింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (11), వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ (0)లు విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.  అయితే మరో ఓపెనర్ మిఛెల్ మార్ష్, మార్నస్ లబుషేన్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఇద్దరు లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.

ఈకలక ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 9 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. లబుషేన్ రెండు ఫోర్లతో 40 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (58),మాక్స్‌వెల్ 31 (నాటౌట్), స్టోయినిస్ 20 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించడంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు పథుమ్ నిసాంకా (61), కుశాల్ పెరీరా (78)లు అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగి పోయారు. వరుస క్రమంలో వికెట్లు తీసి లంకను 209 పరుగులకే కుప్పకూల్చారు. అసలంక (25) తప్ప మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు, స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News