Sunday, December 22, 2024

ఆస్ట్రేలియా గెలుపు

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌తో గురువారం జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి పోయాడు. దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ 19 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు.

స్టోయినిస్ 7 బంతుల్లో అజేయంగా 21 పరుగులు సాధించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. వరుస క్రమంలో వికెట్లను తీస్తూ ఏ దశలోనూ పాకిస్థాన్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. హసీబుల్లా (12), అబ్బాస్ అఫ్రిది 20 (నాటౌట్), షహీన్ అఫ్రికి (11) మాత్రమే రెండంకెల స్కోరును అదుకున్నారు. మిగతా వారు విఫలం కావడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News